అల్లరి నరేష్ కమెడియన్ గా తెలుగు సినిమాకు పరిచయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నో సూపర్ హిట్ట్ చిత్రాల్లో నటించాడు. కానీ రొటీన్ కామిడీ తో సినిమా చేస్తుండటంతో ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యారు. అప్పటి నుండి నరేష్ సినిమాలు ప్రేక్షకులను ఆనందింప చెయ్యలేకపోయాయి. అందుకే స్టార్ హీరో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
మహేష్ బాబుతో కలిసి మహర్షి అనే చిత్రంలో నటించాడు. నరేష్ నటించిన పాత్రకు సినీమా ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఆయన గిరిపాలిక దర్శకత్వంలో బంగారు బుల్లోడు అనే చిత్రంలో నటించాడు. పూజ జావేరి కథానాయకగా నటించింది. సుంకర రాంబ్రమ్మం ఈ చిత్రాన్ని నిర్మించాడు. నిజానికి ఈ చిత్రం లాక్ డౌన్ కు ముందే రిలీజ్ అవ్వాలి కరోనా కారణంగ నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే సినిమాలు విడుదల అవ్వుతున్న తరుణంలో బంగారు బుల్లోడు చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నారు.
ఈ చిత్రం ఈ నెల 23 న అంటే (ఈరోజు ) తెలుగు రాష్ట్రలోని అన్నీ థియేటర్స్ లో విడుదల అవ్వుతుంది. పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న హాస్యభరిత పూర్తి వినోదాత్మక చిత్రం. ఈ సందర్భంగా చిత్రా యూనిట్ హైదరాబాద్ లో ముందస్తు విడుదల వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మెహర్ రమేశ్, అజయ్ భూపతి ముఖ్య అతిదులుగా విచ్చేశారు. హీరో నరేష్ మాట్లాడుతూ.. కామిడీ ఎంటర్టైనర్ గా వస్తున్న చిత్రం స్వర్ణ కార్మికులను ప్రదానంగా చేసుకొని తీసిన చిత్రం ఇది. వారిని ఎక్కడ కూడా కించ పరచలేదు అన్నాడు.
దర్శకుడు మాట్లాడుతూ… నాపై నమ్మకం ఉంచి నాకు దర్శక బాద్యతలు అప్పజెప్పిన నరేష్ గారికి నిర్మాతకు ధన్యవాదలు అన్నారు. ఇంకా నరేష్ తదుపరి సినిమా విషయానికి వస్తే నాంది అనే చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్‌వి2 బ్యానర్ పై సతీష్ వేగేష్ణ నిర్మిస్తున్నాడు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు