ఆహాలో బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ (Unstoppable) షో ఓ రేంజ్ లో దూసుకెళ్తుది. బాలయ్యలో ఈ రేంజ్ సెన్సాఫ్ హ్యూమర్ ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. అంతేకాదు వచ్చిన గెస్టులతో బాలయ్య మాట్లాడే తీరు అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. లేటెస్ట్ గా రానా ఎపిసోడ్ కి సంబందించిన అన్ స్టాపబుల్ ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో అటు బాలయ్య, ఇటు రానా పంచుల మీద పంచులు వేసుకున్నారు.
ఇక రానాని ఉద్దేశిస్తూ ఒకప్పుడు పూలరంగడులా ఉండే వాడివి పెళ్లి తర్వాత బ్యాలన్స్ వచ్చిందని అన్నారు బాలకృష్ణ. అయితే అది వచ్చాకే పెళ్లి చేసుకున్నానని అన్నారు రానా. అంతేకాదు నువ్వు హ్యాండ్ ఇచ్చిన వాళ్లు.. నువ్వు నో చెప్పిన వాళ్లు ఎంతమంది అని అడిగితే.. అదేదో వాళ్లు రాస్తారని అన్నారు. కానీ బాలయ్య ఆపవయ్యా నీ గురించి గూగుల్ ని అడిగినా చెబుతుందని అన్నారు.
బాలకృష్ణ రానా Unstoppable ఎపిసోడ్ ప్రోమోనే సూపర్ ఎంటర్టైనింగ్ గా అనిపించింది. ఇక బాలయ్య తన వైఫ్ దగ్గర తప్పుచేస్తే ఎలా ఉంటారు.. ఫోన్ లో బాలకృష్ణ ఐలవ్యూ వసూ అని చెప్పడం ప్రోమో హైలెట్స్ గా చెప్పుకోవచ్చు.