నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతుంది. గతంలో ఈ దర్శకుడు సింహా. లెజెండ్ వంటి సూపర్ హిట్టు చిత్రాలను తీశాడు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో వస్తున్నది మూడోవ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రం నుండి బాలయ్య బాబు పుట్టిన రోజు నాడు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేసి ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. అందులో ఒక్కటి అఘోరా పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రాని మీర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం మే 28 న విడుదల అవ్వుతుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ సరసన ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అంట. తాజా సమాచారం మేరకు రవి తేజ తో క్రాక్ చిత్రం తీసి ఈ ఏడాది సూపర్ హిట్టును కొట్టిన గోపిచంద్ మలినేని బాలకృష్ణ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు క్రాక్ సినిమా షూటింగ్ సమయంలోనే మొదలు పెట్టాడు అంట.
ఆ సమయంలో బాలకృష్ణ ను షూటింగ్ సెట్ లో కలుసుకుని ఓ పవర్ ఫుల్ యాక్షన్ కథను బాలకృష్ణ కు వినిపించడం జరిగింది అంట బాలకృష్ణ కూడా వెంటనే ఒకే చెప్పినట్లుగా సమాచారం అయితే వీరిద్దరి కలయికలో సినిమా మే మొదటి వారంలో సెట్ పైకి వెళ్లనున్నదని తెలుస్తుంది. బోయపాటి సినిమా తర్వాత బాలకృష్ణ ఓ ఆరుగురు యువ దర్శకుల సినిమాల కథలను విన్నాడు అంట. అందులో ముందుగా గోపిచంద్ మలినేని సినిమాతో వెల్లుతున్నాడు. ఈ చిత్రాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనిలో చిత్ర బృందం ఉంది త్వరలో పూర్తీ వివరాలు తెలియనున్నాయి.