సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం వచ్చని అర్జున్ రెడ్డి ఏ స్థాయిలో సంచలనాలకు తెర లేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డు స్థాయి వసూళ్లను నమోదు చేయడంతో పాటు తెలుగు సినిమా స్థితిని మార్చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఆధరిస్తారా అని సినిమా పరిశ్రమ వాళ్లు అనుకునేంతగా సక్సెస్ అయ్యింది.
ఆ సినిమాతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరో అయ్యాడు. తెలుగులోనే కాకుండా హిందీ మరియు తమిళంలో కూడా ఈ సినిమా రీమేక్ అయ్యింది. అక్కడ కూడా మంచి విజయాలను దక్కించుకోవడంతో ఇది ఒక యూనివర్శిల్ సబ్జెక్ట్ అంటూ నిరూపితం అయ్యింది.
అర్జున్ రెడ్డి విడుదల సమయంలో చాలా హంగామా జరిగింది. అప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాల వారు సినిమాను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేశారు. సినిమా విడుదలను అడ్డుకోవాల్సిందే అంటూ పట్టుబట్టారు. సెన్సార్ ఈ సినిమాకు ఎలా క్లియరెన్స్ ఇస్తుందని వాదనలు వినిపించాయి. అయినా కూడా అర్జున్ రెడ్డి కొన్ని కట్స్ తో తెరపైకి వచ్చింది.
అర్జన్ రెడ్డిలో ఆ కట్స్ లేకుండా ఉంటే యూత్ ఆడియన్స్ కు మరింత కిక్ వచ్చేది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నరు. అర్జున్ రెడ్డి విషయంలో ఇప్పుడు ఒక కీలక నిర్ణయాన్ని దర్శక నిర్మాత అయిన సందీప్ రెడ్డి వంగ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.
మూడు ఏళ్ల క్రితం కట్స్ తో విడుదలైన అర్జున్ రెడ్డిని 2022వ సంవత్సరంలో కట్స్ లేకుండా చాలా సీన్స్ మార్చి విడుదల చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకోసం ఇప్పటి నుండి ప్రయత్నాలు మొదలు పెడుతున్నారట. పెద్ద ఎత్తున సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇలాంటి ప్రయోగాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. కాని ఆ సమయంలో కూడా థియేటర్ల సమస్య వచ్చే అవకాశం ఉంది కదా సెన్సార్ దక్కక పోవచ్చు కదా అనిపిస్తుంది. మరి దర్శకుడు దీనిని నేరుగా విడుదల చేస్తాడా లేందటే థియేటర్ రిలీజ్ కు ప్లాన్ చేస్తాడో చూడాలి.