క్రాక్ చిత్రం తర్వాత రవి తేజ నటిస్తున్న చిత్రం ఖలాడి. రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటికే రవి తేజ ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఈ మధ్యనే ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచాడు. ఈ చిత్రంలో కన్నడ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ విషయంపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నేడు ఖిలాడి టీమ్ యూనిట్ అధికారికంగా అర్జున్ నటిస్తున్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.
ఈ విషయాన్ని దర్శకుడు తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఖిలాడి చిత్రంలోకి సుస్వాగతం యాక్షన్ కింగ్ అర్జున్ అంటూ పోస్ట్ చేశాడు. నేటి నుండి రవి తేజ, అర్జున్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం భారీ సెట్ వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అవ్వుతుందని అంటున్నారు. అర్జున్ సినిమాలు తెలుగులోను మంచి విజయాలను సాదించాయి.
తెలుగు తో పాటుగా, తమిళ, హింది, మలయాళ చిత్రాల్లోనూ అర్జున్ సార్జ నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఖిలాడి చిత్రంలో అర్జున్ చేరడంపై సినిమా అంచనాలు పెరుగుతాయి మాస్ మహారాజ్ రవి తేజ, యాక్షన్ కింగ్ అర్జున్ కలిసి నటిస్తుండటంతో, ఇద్దరి అభిమానుల్లోనూ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి లు ఇద్దరు రవి తేజ తో రొమాన్స్ చెయ్యనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఏ స్టూడియోస్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి భరిలో నిలిపే అవకాశం ఉందని తెలుస్తుంది.