బాహుబలి సినిమాకు ముందు అనుష్క తెలుగు, తమిళ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. బాహుబలి తర్వాత ఆమె సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. ఆ తర్వాత ఆమె చేసింది రెండు సినిమాలు ఒక్కటి భాగమతి, రెండోది నిశ్శబ్దం. ఈ రెండు చిత్రాలో ఒక్కటి పర్వాలేదు అనిపిస్తే మరో చిత్రం ప్లాప్ ను దక్కించుకుంది. లాక్ డౌన్ సమయంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై నిశ్శబ్దం విడుదలై నిరాశ పరిచింది. అనుష్క ఫ్యాన్స్ కూడా ఆమె నుండి సినిమాలు రాకపోవడంతో నిరాశ తో ఉన్నారు.
అనుష్క కూడా చాలా లావు కావడంతో ఆమెకు తగ్గ పాత్రలు మాత్రమే చేస్తుంది. ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ మూవీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం ఓ ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కనున్న సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ హీరోగా మహేశ్ పి దర్శకత్వంలో రారా కృష్ణయ్య అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దర్శకుడు తో ఓ సినిమా చేయడానికి ఆమె సిద్దంగా ఉన్నారు అంట.
ఈ చిత్రంలో ఈమె పాత్ర బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. రారా కృష్ణయ్య చిత్రంతో ప్లాప్ ను దక్కించుకున్న దర్శకుడు. అనుష్క కు హిట్టు ను ఇవ్వగలడా అంటూ చర్చించుకుంటున్నారు. ఈ చిత్రాని యూవి క్రియెషన్స్ బ్యానర్ పై రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె మరల సినిమాల్లో బిజీ అయ్యేందుకు జిమ్ లో వర్క్ ఔట్స్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మునపటి అనుష్క లాగా మరేందుకు చాలా కష్టపడుతుంది.