మెగా డాటర్ నిహారిక పెళ్లి అట్టహాసంగా జరిగింది. (డిసెంబర్ 9) నిహారిక- చైతన్య మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీరి వివాహం జరుగగా..మెగా , అల్లు ఫ్యామిలీ సభ్యులు పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే నిహారిక పెళ్లికి పవన్ మొదటి భార్య కుమారుడు , కుమార్తె హాజరు కాగా..పవన్ భార్య అన్నా లెజినీవా ఎందుకు రాలేదా అని అంత అరా తీయడం మొదలుపెట్టారు. గతంలో మెగా కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు అన్నా లెజినీవా హాజరవుతూనే ఉంది. ఆ మధ్య శ్రీజ కూతురు అన్న ప్రాసనకు కూడా వచ్చింది. ఆ తర్వాత కూడా చాలా వేడుకల్లో కనిపించింది. మరి నిహారిక పెళ్లికి ఎందుకు రాలేదబ్బా అని మాట్లాడుతుండగా..ఆమె ఎందుకు రాలేదో అసలు విషయం వచ్చింది.
ప్రస్తుతం ఈమె ఇండియాలో లేదు.. రష్యాలో ఉందట. క్రిస్మస్ వేడుకల కోసం ప్రతీసారి డిసెంబర్ మొదట్లోనే ఆమె పిల్లలతో సహా అక్కడికి వెళ్లిపోతుంది. ఈ సారి కూడా అక్కడికే వెళ్లిందట. అందుకే నిహారిక పెళ్లికి రాలేకపోయిందని అంటున్నారు. డిసెంబర్ అంతా ఆమె రష్యాలోనే ఉండి.. క్రిస్మస్ వేడుకలు పూర్తైన తర్వాత న్యూ ఇయర్ అయ్యాక ఇండియాకు వచ్చేస్తుంది. ఈసారి కూడా అలాగే చేస్తుందట. అంతే తప్ప నిహారిక పెళ్లికి రాకపోవడానికి మరో కారణం లేదట.