రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‌గారు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు దేశ వ్యాప్తంగా అపూర్వ స్పందన లభించింది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి రంగాలతో సంబంధం లేకుండా అందరూ మొక్కలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టిన రోజు సందర్భంగా.. టాలీవుడ్ బ్లాక్ బ్లాస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వైజాగ్ కు దగ్గరలోని అరకులో తన చిత్ర బృందంతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు శ్రీ విష్ణు సీనియర్ నటులు, నటకీరిటీ రాజేంద్రప్రసాద్, నిర్మాత ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆ తర్వాత అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. నిజంగా మనందరి బాధ్యతను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకున్నారు. ప్రకృతికి మనిషి వల్ల నష్టం జరిగినా.. ఆ నష్టం విపత్తుల రూపంలో మనిషికి నష్టం చేసిన.. అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నం.. మన వరకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం అనే ధోరణితో, ఒక రకంగా చెప్పాలంటే మనిషి బాధ్యతా రాహిత్యంతో పంచభూతాలకు తీరని నష్టం జరిగింది. కానీ, మనందరిలా బిజీ లైఫ్ పేరుతో సంతోష్ తన బాధ్యతల్ని మరిచిపోలేదు. ప్రజాసేవలో తీవ్రమైన ఒత్తిళ్ళున్నా ఏ రోజు విరామం తీసుకోలేదు. ఎవ్వరు మొక్కలు నాటిన, ఎక్కడికి రమ్మన్నా కూడా తన వీలు చూసుకొని వెళ్తుండటాన్ని మనం సోషల్ మీడియా లో చూస్తున్నాం. నిజంగా వారికి హ్యాట్సాఫ్ చెప్పాలి.. మేం మర్చిపోయిన బాధ్యతల్ని మీరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు.. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలి, అందమైన, సమతూకమైన ప్రకృతి ఏర్పడాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే నా వంతుగా, నా మిత్రులు, శ్రేయోభిలాషులందరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు.