యాంకర్ శ్యామల గురించి ఇప్పుడు ప్రత్యేకంగ చెప్పనవసరం లేని పేరు. బుల్లి తెరపై, వెండి తెరపై మంచి పేరును తెచ్చుకుంది. కానీ సినిమా ఇండస్ష్ట్రి కి వచ్చిన కొత్తలో తాను కూడా అందరిలాగే చాలా ఇబ్బందులు ఎదురుకున్నట్లుగా ఓ ప్రముఖ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలను తెలియజేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… నాకు చిన్నప్పటి నుండి నటిని కావాలని, సినిమాల్లో, టివి లో కనిపించాలని కోరిక. అందుకే మా అమ్మను తీసుకొని మా సొంత ఊరు నుండి హైదరాబాద్ కు వచ్చాను.
ఇక సినిమా మరియు బుల్లి తెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాను. అందరిలాగే నేను సినిమా కష్టాలను అనుభవించాను. మొగవారికి అవకాశాలు ఎలాగైనా వస్తాయి. అదే ఆడవారికి వచ్చే సరికి ఇక్కడ పరిస్థితులు మొత్తం తారుమారుగా ఉన్నాయి. చాలా మంది కమిట్ మెంట్స్ అడుగుతుంటారు. ఒప్పుకుంటే అవకాశం వస్తుంది లేకపోతే లేదు. నా జీవితంలో అలాంటివి ఫేస్ చేశాను. నేను ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓ సీరియల్ కి సినిమాలకు పనిచేసిన కెమెరా మెన్, నేను చేసే సీరియల్ కు పనిచేస్తున్నాడు. ఆ సమయంలో నన్ను చాలా వేదించాడు.
నాకు నువ్వు కమిట్ మెంట్ ఇవ్వాలని కోరాడు. అందుకు నేను నో చెప్పాను. ఆ కోపంతో.. నన్ను కాదని నీకు సినిమాల్లో అవకాశాలు రావు అని చెప్పి బెధిరింపులకు కూడా దిగాడు. ఆ సమయంలో ఈ సినిమా ఫీల్డ్ ఎందుకు చక్కగా మా ఉరుకు వెళ్లిపోదాము అనుకున్న కానీ.. ఇక్కడకు వచ్చి మళ్ళీ వెనక్కు తిరిగి వెళ్ళలేక పోయాను. అందుకే ధైర్యం చేసి ఇక్కడే ఉండిపోయాను.
ఆ తర్వాత ఆ కెమెరా మెన్ గురించి ఇండస్ష్ట్రి లో పెద్దవారికి ఫిర్యాదు చెయ్యడంతో నాకు అతని నుండి బాద తప్పింది. ఇంతకు ఆ కెమెరా మెన్ ఎవరు అనేది మాత్రం యాంకర్ శ్యామల చెప్పలేదు. ప్రస్తుతం శ్యామల బుల్లితెర పై కొన్ని షో లకు యాంకరింగ్ చేస్తూనే సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. అలాగే సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో శ్యామల తన యాంకరింగ్ తో అదరగొడుతుంది.