యాంకర్ శ్యామల, సినిమా ఇండస్ష్ట్రి కి చెందిన నరసింహా రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇతను సిరియల్స్ లల్లో కీలక పాత్రలు పోషిస్తూంటాడు. ఇటీవలే వైఎస్ఆర్సిపి పార్టీలో చెరీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. నరసింహా రెడ్డి పై ఓ మహిళా రాయదుర్గం పోలీసు స్టేషన్ లో కేసు పెట్టింది…
యాంకర్ శ్యామల భర్త, నరసింహారెడ్డి ఓ మహిళా దగ్గర 2017 నుండి విడుతల వారీగా కోటి రూపాయలను తీసుకున్నాడు. డబ్బు విషయమై నరసింహారెడ్డి నీ అడుగుతే తన అనుచరులతో బెదిరింపులకు దిగడంతో ఆ మహిళా నరసింహా రెడ్డి పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నరసింహా రెడ్డి కి మరియు బాధితురాలి కి మధ్య ఓ మహిళా సెటిల్ మెంట్ విషయమై రాయబారం నడిపినట్లుగా బాదిత మహిళా తన పిటిషన్ లో పేర్కొన్నది. నరసింహా రెడ్డి డబ్బులు ఇవ్వకపోవడమే కాకుండా తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా పేర్కొండంతో నరసింహా రెడ్డి ని మరియు రాయబారం నడిపిన మహిళను ఇద్దరిని పోలీసు లు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
యాంకర్ శ్యామల ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకొని టివి మరియు సినిమా తెరపై రానిస్తున్న క్రమంలో తన భర్త ఇలా ఛీటింగ్ కేసు లో ఇరుక్కోవడం ఆమెకు కెరీర్ పరంగా పెద్ద దెబ్బ అని చెప్పాలి. మరి తన భర్త నరసింహా రెడ్డి అరెస్టు విషయమై యాంకర్ శ్యామల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.