జబర్దస్త్ హాట్ యాంకర్ రష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటే అవుననే సమాధానం ఆమె సన్నిహితుల నుండి వస్తుంది. ఆమెకు సంబంధించినంత వరకు ఈ మధ్య కాలంలో పెళ్లికి సంబంధించిన పనులు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం అందుతోంది. గత కొన్నాళ్లుగా ఆమె పెళ్లి విషయమై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైజాగ్ చెందిన ఒక పారిశ్రామికవేత్త తో ఆమె ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె కొట్టిపారేసింది.
ఇప్పుడు ఆమె ఎవరిని పెళ్లి చేసుకోబోతుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సివుంది. బుల్లి తెర ప్రేక్షకులందరికీ కూడా సుధీర్ తో ఆమె ప్రేమలో ఉందా అనే అనుమానం ఉంది. గతంలో వీరిద్దరికి పెళ్లి అయినట్లుగా పలు షోల్లో చూపించారు. కానీ ఆమె మాత్రం సుధీర్ ని ఎప్పుడూ కూడా తన స్నేహితుడు అని మాత్రమే అంటుంది. ప్రేమ అనేది ఏమీ లేదు అంటూ గతంలో వారిద్దరూ అనేక సందర్భంలో క్లారిటీ ఇచ్చారు.
సుధీర్ తో కేవలం ఆన్ స్క్రీన్ రొమాన్స్ మాత్రమే అంటూ రష్మి గౌతమ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె ప్రేమ విషయం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఆ విషయమై ఎలా స్పందిస్తుంది ఏంటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ కామెడీ షో తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్న రష్మీ ప్రస్తుతం నందుతో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా పేరు బొమ్మ బ్లాక్ బస్టర్.
ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే ఈమె మరో రెండు సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశాలున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిన తర్వాత రష్మీ పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అంటే వచ్చే ఏడాది చివరి వరకు రష్మీ పెళ్లి పీటలు ఎక్కి కొత్త జీవితాన్ని ఆరంభించే అవకాశం ఉన్నట్లుగా బుల్లితెర వర్గాల సమాచారం.