మలయాళ నటుడు మోహన్ లాల్ అక్కడ పెద్ద సినిమా సూపర్ స్టార్. ఆయనకు ఓ కొడుకు, ఓ కూతురు. కొడుకు పేరు ప్రణవ్ మోహన్ లాల్ ఆల్రెడీ మలయాళ సినిమాలో నటుడుగా సింగర్ గా రానిస్తున్నాడు. కూతురు విస్మయ మోహన్ లాల్ గురించి మాత్రం ఎవరుకు తెలియదు. అయితే ఇప్పుడు ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే మోహన్ లాల్ .. ఈ మధ్య బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కు ఓ గిఫ్ట్ ను పంపించారు అంట.
ఈ విషయాని ఆయన ట్వీట్ ద్వారా తెలియజేశాడు… నాకు ఆ బహుమతి చాలా నచ్చింది అంటూ అందులో సర్ ఫ్రైజ్ ఉంది ఉందని తెలియజేశాడు. మోహన్ లాల్ కూతురు విస్మయ రాసిన “గ్రెయిన్స్ ఆఫ్ స్టార్డస్ట్’ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేశారు. అందులో ఓ కాపీ ని అమితాభ్ కు మోహన్ లాల్ పంపించాడు. ఈ పుస్తకాన్ని చూసిన అమితాబ్ విస్మయ కు అల్ ది బెస్ట్ చెబుతూ.. సృజనాత్మకత తో కూడిన కవితలతో పాటుగా ఆలోచింప చేసే మంచి పెయింటింగ్స్ ఉన్నాయని అన్నాడు.
అలాంటి గొప్ప తండ్రి కడుపులో పుట్టినందుకు విస్మయకు మంచి అలవాట్లు వచ్చాయని అన్నాడు. వారసత్వ లక్షణాలు ఆమె పుణికి పుచ్చుకున్నారు అంటూ కొనియాడాడు. అమితాబ్ ప్రశంసల పై మోహన్ లాల్ హర్షం వ్యక్తం చేశాడు. అంత గొప్పనటుడు నుండి అభినందనలు దక్కడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నాడు. ఓ కూతురుకి తండ్రి గా ఇంతకన్న ఏమి కావాలని అని అన్నాడు. ఈ సందర్భంగా అమితాబ్ కు కృతజ్ఞతలు తెలియజేశాడు. మోహన్ లాల్ సినిమా విషయానికి వస్తే ఈమధ్యనే దృశ్యం 2 లో నటించి మంచి సక్సెస్ కొట్టాడు.