బాహుబలి సినిమా తో ప్రభాస్ ఇండియన్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ తర్వాత సాహో చిత్రంతో మరోసారి తన సత్తా చూపించాడు. ప్రస్తుతం ప్రభాస్, కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే ఈ చిత్రంలోనటించబోయే 100 మంది ఆర్టిస్ట్ లను సెలెక్ట్ చేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనేసరికి లెక్కలు మారిపోతున్నాయి.
అవును సలార్ చిత్రం యొక్క థియేట్రికల్ రైట్స్ కోసం బయ్యర్లు ఇప్పటినుండే ఎగబడుతున్నారు. ఇదే తరుణంలో ఓటిటి రైట్స్ కూడా కోట్లు పెట్టి చెల్లించేందుకు ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ సిద్దంగా ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వారు సలార్ యొక్క స్ట్రీమింగ్ రైట్స్ ను 100 కోట్లకు ఆఫర్ చేసిందని సమాచారం. ఇంతవరకు ఏ బాలీవుడ్, టాలీవుడ్ హీరోలకి కూడా ఇంత డిమాండ్ లేదు. అది కూడా మూవీ థియేటర్ లో విడుదలైన సినిమాకు అంత రేట్స్ పెట్టి కొనడం అనేది ఒక్క ప్రభాస్ సలార్ కు మాత్రమే చెల్లింది.
కేజిఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ తన సినిమా మార్కెట్ లెవల్ ఏమిటో చూపించాడు. బాహుబలి, సాహో చిత్రాలతో ప్రభాస్ అంటే ఏమిటో ఇప్పటికే అందరికి అర్థం అయి ఉంటుంది. ఈ చిత్రాలు అమెజాన్ ప్రైమ్ లో లక్షలల్లో వ్యూస్ ను రాబడుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ అనే చిత్రాని పూర్తి చేశాడు. త్వరలో అధిపురూష్ సెట్ లో సందడి చేయనున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల అవ్వనున్నది. ప్రశాంత్ నీల్ కూడా సలార్ నుండి కాస్త బ్రేక్ తీసుకొని కేజిఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నాడు. 16 జూలై న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.