శ్రీ రామ్ వేణు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం వకీల్ సాబ్. ఈ చిత్రాన్ని బోణి కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. పవన్ చాలా గ్యాప్ తర్వాత నటించిన చిత్రం కావున మెగా అభిమానులు ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టిజర్, ట్రైలర్ లు ఆకట్టుకున్నాయి. ఈ నెల 9వ తేదీన విడుదల అయ్యింది.
మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో మంచి వసూళ్లను రాబట్టింది. మరి ముఖ్యంగా ఈ చిత్రం సామాజిక అంశంతో సందేశాత్మకంగా ఉండటంతో ప్రేక్షకులు బాగా ఆదరించారు. మరి ముఖ్యంగా మహిళలు బాగా కనెక్ట్ అయ్యారు. మహిళలపై జరుగుతున్నా దాడులు, అత్యాచారాల గురించి వకీల్ సాబ్ చిత్రం లో బాగా చూపించారు. అందుకే ఈ చిత్రం యొక్క విజయంలో మహిళల ది చాలా ముఖ్య పాత్ర ఉంది.
కరోనా కారణంగ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూత పడటంతో ఈ చిత్రం ఎక్కువకాలం ఆడలేకపోయింది, ఇక ఇంత మంచి చిత్రాన్ని దిల్ రాజ్ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ పై విడుదల చేయాలని అనుకున్నాడు. ఈ చిత్రం యొక్క రైట్స్ ను ముందుగా అమెజాన్ కు 14 కోట్లకు అమ్మేశాడు. అయితే ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కు ముందు అంటే ఎర్లీ రిలీజ్ కు అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లను ఆఫర్ చేసింది. మొత్తానికి దిల్ రాజ్ వకీల్ సాబ్ సినిమాతో డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా 26 కోట్ల వరకు లాభం పొందాడు. ఈ చిత్రంలో అంజలి,నివేత థామస్, అనన్య నాగళ్ళ లు కీలక పాత్రలో నటించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో నటించాడు. తమన్ ఈ చిత్రంకోసం ప్రాణం పెట్టి మరి మంచి మ్యూజిక్ ఇచ్చాడు.