వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శీను చిత్రంతో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయ్యాడు. సమంత కథానాయకిగా నటించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తర్వాత ఆయన నటించిన సినిమాలు మొత్తం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. జయజానకి నాయక, రాక్షసుడు చిత్రాలు తప్ప. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హింది డబ్బింగ్ వర్షన్ లో ఈ చిత్రం రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ను బేస్ చేసుకొని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం ద్వారా బి టౌన్ లోకి సాయి శ్రీనివాస్ అడుగుపెడుతున్నాడు. తమిళ్ రాట్చసన్ ను తెలుగులో రాక్షసుడుగా రీమేక్ చేశారు. ఈ చిత్రం సాయి శ్రీనివాస్ కు కమర్షియల్ హిట్ ను తెచ్చిపెట్టింది. ఇక కవచం, సీత, స్పీడున్నోడు, చిత్రాలు నిరాశను మిగిలించాయి. ప్రస్తుతం ఆయన నటించిన అల్లుడు అదుర్స్ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. కానీ ప్రేక్షకులనుండి పాజిటివ్ టాక్ ను మాత్రం దక్కించుకోలేక పోయింది. ఎప్పుడు రొటీన్ కథలను ఎన్నుకుంటున్న సాయి శ్రీనివాస్ కి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిలించింది.
రొటీన్ కి బిన్నంగా కాస్త డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేస్తే సాయి శ్రీనివాస్ కు మరల విజయాలు దక్కుతాయని అభిమానులు అంటున్నారు. సంక్రాంతి రోజున విడుదలైన ఈ చిత్రం కోటి ముపై లక్షలను కలెక్ట్ చేసిందని సమాచారం. అల్లుడు అదుర్స్ చిత్రం సంతోస్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చింది. ఈయన గతంలో తీసిన చిత్రాలు కొన్ని డిజాస్టర్ అవ్వుతే కొన్ని యావరేజ్ టాక్ ను దక్కించుకున్నాయి. ఇప్పటికైనా బెల్లంకొండ రూటు మార్చి కాస్త కమర్షియల్ సినిమాలు చేస్తే గాడిలో పడే అవకాశం ఉంది. లేకపోతే ఇండస్ష్ట్రి లో ఎక్కువ కాలం నిలబడటం కష్టమే అని సినీ విశ్లేషకులు అంటున్నారు.