అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందబోతున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్‌కు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సినిమాను మార్చి నెలలోనే కేరళలో షూటింగ్ ప్రారంభించాలని భావించినప్పటికి కూడా కరోనా వల్ల ఆగిపోయింది. లాక్ డౌన్‌తో షూటింగ్ మొత్తం ఎక్కడికి అక్కడికి నిలిచి పోయింది. మళ్లీ ఆరు నెలల తర్వాత పుష్ప షూటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున కాస్ట్ అండ్ క్రూ లేకుండా సింపుల్‌గా సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారట.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటగా అల్లు అర్జున్ మరియు రష్మికలపై డాన్స్ తో షూటింగ్‌ను ఆరంభించబోతున్నారు. ఆ తర్వాత వికారాబాద్ ఫారెస్ట్‌లో సినిమాను షూటింగ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. గందపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని ఇప్పటికే అర్థం అయ్యింది. స్మగ్లింగ్ లారీ డ్రైవర్ గా పుష్ప పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇప్పటి వరకు విడుదలకు రెడీ అయ్యేది. దసరాకు సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని మొత్తం కరోనా వల్ల తలకిందులు అయ్యింది. ఎప్పుడెప్పుడు పుష్ప సినిమా షూటింగ్ మొదలు అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి బిగ్గెస్ట్ సక్సెస్‌ను దక్కించుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
సుకుమార్ గత చిత్రం రంగస్థలం కూడా ఇండస్ట్రీ హిట్ అనే విషయం తెల్సిందే. అందుకే రికార్డు స్థాయి బడ్జెట్ తో ఏమాత్రం రాజీ పడకుండా ఈ సినిమాను మైత్రి వారు నిర్మిస్తున్నారు. పుష్ప సినిమా కోసం గత కొన్నాళ్లుగా బన్నీ గడ్డం జుట్టు పెంచుతున్నాడు. చాలా మాస్ లుక్ లో బన్నీ కనిపిస్తాడని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బన్నీ మరియు రష్మికలు చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే వర్క్ షాప్ నిర్వహించి ట్రైనింగ్ ఇచ్చారు.