స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..బన్నీ వాసు కుటుంబ సభ్యులను పరామర్శించారు. బన్నీ వాసు సోదరుడు గవర సురేష్ అనారోగ్యంతో మరణించారు. సురేష్ గత కొద్దీ రోజులుగా రెండు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఆయన శుక్రవారం రాత్రి మృతి చెందారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఆయన్ని కాపాడలేకపోయామని డాక్టర్లు చెప్పుకొచ్చారు. సురేష్‌కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు వాసు కు ఫోన్లలో ధైర్యం చెప్పారు.
సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లులో బన్నీ వాసు కుటుంబ సభ్యులను అల్లు అర్జున్, శిరీష్, దర్శకుడు సుకుమార్ లు పరామర్శించారు. ప్రత్యేక చార్టడ్ ఫ్లైట్ లో పరామర్శించడానికి వెళ్లారు. కాగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జనసేన ఇంచార్జి గుణ్ణం నాగబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం బన్నీ వాసు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో బన్నీ వాసు పని చేసేవాడు. ఈ క్రమంలో జీఏ2 పిక్చర్స్‌కు సహా భాగస్వామిగా ఉన్నారు.