అల వైకుంఠపురం లో చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో పుష్ప మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా..రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టుకుంది. ఇక ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించి అభిమానుల్లో సంబరాలు నింపారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో బన్నీ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో యువసుధ బ్యానర్‌పై మిక్కిలినేని సుదాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి బన్నీ స్నేహితులు శాండీ, స్వాతి, నట్టి కోలు నిర్మాతలుగా చేయనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాను 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. కాగా ఈ సినిమా తాలూకా కొన్ని లీక్స్ బయటకు వచ్చి వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ రోల్ అభిమానుల్లో ఆత్రుత పెంచుతుంది.
అల్లు అర్జున్ ఈ సినిమాలో రాజకీయ నేతగా కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఇంతకుముందు బన్నీ రేసుగుర్రం పొలికల్ బేస్డ్ అయినా అందులో బన్నీ రాజకీయ నేత కాదని, ఇందులో బన్నీ రాజకీయ నేతగా చేస్తాడని అంటున్నారు. ఈ సినిమాలో స్టూడెంట్ పాలిటిక్స్, పేదరికం, నిరక్షరాస్యత వంటివి ప్రధాన అంశాలుగా రూపొందనుందని చెపుతున్నారు. ఒకవేళ ఇదే నిజమయితే బన్నీ ఫాన్స్‌కు ఇక పండగే.
ఇక కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.