
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో సీతగా… ప్రేక్షకులను పలకరించనుంది. అందం, అభినయంతో పిచ్చెక్కిస్తున్న ఆ క్యూట్ బ్యూటీ ఇటీవలే రిలీజ్ చేసిన గంగూబాయి కతియావాడి ట్రైలర్ లో అదరగొట్టింది. తన యాక్టింగ్ కి విమర్శకులు సైతం ప్రశంసంల వర్షం కురిపించారు.

ఇదిలా ఉండగా.. ఆమె ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా గడుపుతోంది. అంతే కాదండోయ్ ఈమె సోషన్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటకప్పుడు తన అప్ డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఇయితే తాజాగా ఆమె తెలుపు రంగు చీరకట్టుకొని అందాలను ఆరబోసింది. అయితే ఆమె అందాన్ని చూసిన నెటిజెన్లు చాలా బాగున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

అలియా భట్ పాత్ర ఆర్ఆర్ఆర్ సినిమాలో కేవలం 15 నిమిషాలేనట. అయినప్పటికీ పెద్ద సినిమా కావడంతో అలియా అందులో నటించింది. బాలీవుడ్ లో భారీ విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు పారితోషికం కూడా బాగానే తీసుకుంటుందట. దాదాపు ఒక్కో సినిమాకు 9 కోట్లు తీసుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం అలియా భట్ తాను నటించిన గంగూభాయ్ కతియావాడా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇందుకోసం డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరిస్తూ ప్రేక్షకులకు కనువిందు చేస్తోంది. అందులో భాగంగానే తెలుపు రంగు చీరలో హొయలొలికించింది ఇందులో అలియా స్టన్నింగ్ లుక్స్ చూసిన అభిమానులు షాకవుతూ తెగ షేర్ చేస్తున్నారు.