స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా అల వైకుంఠపురములో. అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రం కసితో చేసిన సినిమా ఇది. సినిమా కథ పాతదే అన్నట్టు అనిపించినా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ఇక థమన్ అందించిన మ్యూజిక్ సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి. నీ కాళ్ళని పట్టుకు వదలన్నవి.. బుట్ట బొమ్మ, రాములో రాములా సాంగ్స్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
సినిమాలోని ఆ మూడు సాంగ్స్ వందల మిలియన్స్ కొద్దీ వ్యూస్ రాబట్టుకున్నాయి. ఇక అందులో బుట్టబొమ్మ సాంగ్ అయితే డిజిటల్ వ్యూస్ లో రికార్డులు సృష్టిస్తూనే ఉంది. అల వైకుంఠపురములోని బుట్ట బొమ్మ సాంగ్ లేటెస్ట్ గా 400 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అంటే 40 కోట్ల మంది ఈ పాటని వీక్షించడం జరిగిందన్నమాట. ఇది నిజంగానే సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పొచ్చు.
ఈ సాంగ్ లో బన్నీ, పూజా హెగ్దే పర్ఫార్మెన్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అందుకే ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టని విధంగా సాంగ్ ప్రేక్షకులను అలరిస్తుంది. మ్యూజిక్ తో సినిమాకు ముందే హిట్ క్రేజ్ తెచ్చుకున్న అల వైకుంఠపురములో రిలీజ్ తర్వాత వసూళ్ళ బీభత్సం సృష్టించింది. బన్నీ, త్రివిక్రం కెరియర్ లోనే కాదు నాన్ బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసి బాక్సాఫీస్ పై బన్నీ తన పంజా దెబ్బ ఏంటో చూపించినట్టు అయ్యింది.