అల్లు అరవింద్ నిర్మాణంలో ఆహా ప్రస్తుతం మంచి ఫాంలోనే ఉంది. కానీ కొన్ని వివాదాస్పద పనులతో వార్తల్లో నిలుస్తుంది. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అనే సంగతిని ఆహా మర్చిపోయినట్లుగా ఉన్నది అది చేసే పనులు చూస్తే అర్థం అవ్వుతుంది. సబ్ స్క్రైబర్స్ ను కాపాడుకోవడం పెంచుకోవడం కోసం అల్లు అరవింద్ అండ్ నిర్మాణ టీమ్ బాగానే కష్టపడుతుంటే ఆహా టీమ్ చేసే కొన్ని పొరపాట్ల వలన ఉన్న కాస్త సబ్ స్క్రైబర్స్ కూడా తుస్ మానేలగా ఉన్నారు.
ఆహాలో సమంత హోస్ట్ గా సామ్ జామ్ అనే టాక్ షో వస్తుంది. నందిని రెడ్డి దర్శకపర్యవేక్షణలో ఈ షో కొనసాగుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్ తో సమంత ఓ టాక్ షో ని చేసింది. దాని ప్రమోషన్ లో బాగంగా అల్లు అర్జున్ ప్రోమ్ ను సోషల్ మీడియాలో వేస్తూ అల్లు అర్జున్ పేరుకు ముందు ఆ ప్రోమో డిస్క్రిప్షన్ లో మెగాస్టార్ చేర్చడంతో మెగా అభిమానులు ఆహా టీమ్ ను ట్రోల్స్ చేస్తూ ఓ ఆట ఆడుకున్నారు. తాజాగా మరో వివాదంతో ఆహా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వుతుంది. నెట్ ఫ్లిక్స్ వాళ్ళు తెలుగు కంటెంట్ తో పిట్టకథలు అనే వెబ్ సిరీస్ ను నిర్మించారు. వాళ్ళు నిర్మిస్తున్న మొట్టమొదటి తెలుగు వెబ్ సిరీస్ ఇదే.
ఈ టీజర్ ను ఇటీవలే విడుదల చేస్తూ కాస్త హంగామా సృష్టించారు. ఈ విషయంపై ఆహా టీమ్ మా దగ్గర కూడా ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి మేము అంతలా అరుస్తున్నమా అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పై నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సైలెంట్ గానే ఉన్నారు కానీ సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం ఆహా ను బుదవారం మధ్యానం మొదలు పెట్టి సాయంత్రం వరకు ట్రోల్స్ చేస్తూ బాగా వైరల్ చేశారు. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి ఆహాలో పెట్టె మీరుకూడా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ గురించి మాట్లాడుతార అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ కు ఉన్న కంటెంట్ ను ఆహా కంటెంట్ ను పొలుస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆహా మరో వివాదాస్పద ట్వీట్ తో వార్తల్లో నిలిచింది.