కమెడియన్ సప్తగిరి, బొమ్మరిల్లు బాస్కర్ దగ్గర మొదట “బొమ్మరిల్లు” సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత “దేశముదురు” సినిమా ద్వారా కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అడపాదడపా సినిమాల్లో కామిడి పాత్రలో నటిస్తూనే ఉన్నాడు. కానీ సరైన గుర్తింపు మాత్రం రావడంలేదు. ఆ తర్వాత “ప్రేమ కథా చిత్రమ్”లో సప్తగిరి చేసిన కామిడి ఇప్పటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.
ఆ తర్వాత ఆయన సప్తగిరి ఎక్స్ ప్రెస్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. అసిస్టెంట్ దర్శకుడు నుండి హీరోగా మారడానికి చాలా కష్టపడ్డాడు. అలా అని కామిడి సినిమాలో అవకాశం వస్తే చేస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ ఇండస్ష్ట్రి లో జూనియర్ బ్రహ్మానందం అనే స్థాయికి చేరుకున్నాడు. తాజాగా ఆహా లో ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ముందుకు వచ్చాడు. అవును కామిడి జోనర్ లో ఈ వెబ్ సిరీస్ ఉండనున్నదని సమాచారం. ఆహా ప్రస్తుతం కంటెంట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది.
మంచి కంటెంట్ దొరికితే తానే స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుంది. యాక్షన్ రొమాన్స్ ఇలా జోనర్ ఏదైనా మంచి స్టఫ్ ఉన్న కాంటెంట్స్ కోసం వెతుకుతుంది. రీసెంట్ గా ఆహా యానివర్సరీ సంబరాలను కూడా చేసుకుంది. చిన్న చిన్న వెబ్ సిరీస్ లతో పాటుగా.. చిన్న చిన్న మూవీస్ ను కూడా యాంకరేజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సప్తగిరి తో ఓ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేసింది.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయింది అంట.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ నిర్మాత కరుణ కుమార్ నిర్మించనున్నాడు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నది.