ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో పాటు చక్కటి కుటుంబ కథ చిత్రాలను నిర్మించిన యంఎస్ రాజు.. ఆ తర్వాత రెండు సినిమాలతో భారీగా నష్టపోయాడు. దాంతో సినిమాలకే దూరమయ్యాడు. చాల గ్యాప్ తర్వాత దర్శకుడి గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
డర్టీ హరి పేరుతో డిసెంబర్ 18న ఫ్రైడే మూవీస్ ఆన్ లైన్ ATT ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి టైటిల్ రోల్ చేయగా..రుహానీ శర్మ .. వసుదేవ అనే పాత్రలో కనిపించింది. మొదట ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ తప్ప ఏమీ లేదని అంతా విమర్శించారు. కానీ, సినిమా విడుదలైన తరవాత విమర్శకుల ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ఈ మూవీ ఆహా లో కూడా చూడవచ్చు.