అల్లు అరవింద్ ఓ వైపు సినిమాలు నిర్మిస్తూనే మరో వైపు ఆహా కోసం మంచి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్, సినిమాలను తీసుకువస్తున్నాడు. డిఫరెంట్ కన్సెప్ట్ లతో ఆహా ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లపై ఎన్నో ఓటిటి లు వచ్చాయి. వాటికి పోటీగా ఆహా రానిస్తుంది. ఇక ముందు ముందు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.
మొదటి నుండి కూడా ఆహా టీమ్ చాలా కష్టపడింది. లాక్ డౌన్ సమాయని ఆహా చాలా చక్కగా ఉపయోగించుకుంది. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు ను కొనుగోలు చేసి సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటూ పోయింది. రాజ్ తరుణ్ నటించిన ఒరేయ్ బుజ్జిగా, సుహాస్ కలర్ ఫోటో వంటి చిన్న చిత్రాలు ఆహాకు మంచి డబ్బులను తెచ్చిపెట్టింది.
ముఖ్యంగా మలయాళం సూపర్ హిట్టు అయిన చిత్రాలను తెలుగులో డబ్బ్ చేసి విడుదల చేయడం కూడా ఆహా కు మంచిగా కలిసి వచ్చింది. బాలీవుడ్ లో కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ అంటూ ఓ షో చేస్తాడు. ఆ మాదిరి ఆహాలో సామ్ జామ్ అనే టాక్ షో ని తీసుకువచ్చారు. మొదట కొంచెం అటు ఇటు నడిచిన ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలను రంగంలోకి దింపి సామ్ జామ్ టాక్ షో కి మంచి పబ్లిసిటీ తీసుకువచ్చారు.
ఈ షో అక్కినేని కోడలు సమంత హోస్ట్ గా చేస్తుంది. ఇక నేటికి ఆహా మొదలై ఏడాది అవ్వుతుంది. కావున ఆహా టీమ్ ఈ ఏడాది యానివర్సరీ సెలబ్రేషన్స్ ను మొదలు పెట్టింది. అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నాడు. అందుకు ఆయనకు గ్రాండ్ గా వెల్కం చెప్పేందుకు ఆహా అన్నీ ఏర్పాట్లను చేసింది. మరికాసేపట్లో ఆహా సెలబ్రేషన్స్ మొదలవనున్నాయి.