
హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక జంటగా నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న రావాల్సిన ఉంది. అయితే ఈ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేయనున్నట్లు సినిమా బృందం ప్రకటించింది. ఈ సినిమాలో ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించగా… తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు.

అయితే సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ చిత్ర బృందం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు ఇప్పటికే చాలా పాపులర్ అయ్యాయి. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ కు ఒక్క హిట్ కూడా లేదు. అయితే రణరంగం, జాను, మహా సముద్రం వంటి సినిమాలతో డీలా పడిపోయిన శర్వానంద్ ఈ సినిమాపై భారీగా అశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆశ నెరవేరి ఈ సినిమా హిట్టు అవుతుందా లేకా.. గత సినిమాల్లాగే ఫ్లాప్ అవుతుందా అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకూ వేచి చూడాల్సిందే.