తమిళ నటుడు విజయ్ లోకేశ్ కనగరాజు దర్శకత్వంలో మాస్టర్ చిత్రంలో నటించి మంచి విజయాన్ని ఈ ఏడాది అందుకున్నాడు ఈ చిత్రం తో తను 64 చిత్రాలను పూర్తి చేసుకున్నాడు. ఇక తన 65 వ సినిమా పనులపై విజయ్ చాలా ఫోకస్ గా ఉన్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవ్వుతున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం పూజ హెగ్డే ను సంప్రదించగ ఆమె వెంటనే ఓకే చెప్పింది ఈ విషయాన్ని సన్ పిక్చర్స్ వారు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం పూజ హెగ్డే టాలీవుడ్, బాలీవుడ్ అంటూ సినిమాలు చేస్తుంది. తెలుగు స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లు కొట్టేస్తుంది. ముకుంద సినిమా ద్వారా పరిచయం అయిన పూజా వరస అవకాశాలు ఆమె వెంట క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంలో నటించింది. అలాగే డార్లింగ్ ప్రభాస్ తో రాధే శ్యామ్ అనే చిత్రం ను పూర్తి చేసింది. చరణ్ కు జోడీగా ఆచార్య చిత్రంలో ఓ 15 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటిస్తుంది. అందుకు పూజా రెండు కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం.
విజయ్ సినిమాతో మరల కోలివుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుంది. తొమ్మిది సంవత్సరాల క్రితం మూగమూడి అనే చిత్రం ద్వారా పరిచయం అయింది. ఆ సినిమా తర్వాత మరల ఆమె కోలివుడ్ వైపు తిరిగి చూడలేదు. ఈ సినిమా కోసం ఆమెకు భారీగానే పారితోషికం ముట్టజెప్పినట్లుగా తెలుస్తుంది. మరోసారి పూజా హెగ్డే కోలివుడ్ లో వరస ఆఫర్స్ తో బిజీ అవ్వనున్నది.