హిస్టారికల్ కథలకు ప్రాణం పోసే రచయిత ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే ఒకే ఒక్క పేరు విజేయేంద్ర ప్రసాద్. అవును అయిన రాసిన పీరియాడికల్ స్టోరీస్ ఇప్పటికే విజయాన్ని అందుకున్నాయి. బాహుబలి సినిమా కథ ద్వారా ప్రపంచ వ్యాప్తంగ గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భజరంగి భాయిజన్ అయిన రాసినదే. అలాగే కంగనా రనౌత్ నటించిన మనికర్ణిక స్టోరీ ని కూడా విజయేంద్ర ప్రసాదే అందించాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం యొక్క కథ కూడా అతనిదే. హిస్టారికల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిన రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటాడానికి రెడీ అవ్వుతున్నాడు. అవును అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో సీత (ది ఇన్కారినేషన్) అనే చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నాడు. ఈ చిత్రంలో రామాయణం ఆదారంగా తెరకెక్కనున్నది. ఇప్పటికే రామాయణం పై పలు సినిమాలు రెడీ గా ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా రాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు టైటిల్ పోస్టర్ ను ఆవిష్కరించాడు. అయితే ఈ చిత్రంలోని సీత పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై అధికారికంగా ఎటువంటి క్లారీతి లేదు కానీ బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం మేరకు కరీనా కపూర్ సీత పాత్రలో నటించనున్నదని సమాచారం. అయితే ఇటీవలే కరీనా కపూర్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె మరల సినిమాలోకి ఎంట్రీ ఇవ్వాలంటే దాదాపుగా ఏడాది సమయం పడుతుంది. ఆ సమయం వరకు ఈ చిత్ర బృందం వెయిట్ చేస్తుందా లేదా అనేది తెలియలిసి ఉంది. లేకపోతే మరో బాలీవుడ్ హీరోయిన్ చేతిలోకి ఈ సినిమా వెల్లుతుందా అనేది తెలియాలిసి ఉంది.