టాలీవుడ్ హీరో రాజశేఖర్ కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత, తన తదుపరి సినిమా విషయంలో స్పీడ్ పెంచాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా శేకర్ అనే చిత్రంలో నటించనున్నట్లుగా సగం కనిపించే ముఖం తో ఫస్ట్ లుక్ ను విడుదల చేశాడు. నెరిసిన గడ్డంతో రాజశేఖర్ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో రాజశేఖర్ రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు అని సమాచారం. ఈ చిత్రానికి లలిత్ దర్శకత్వం వహించనున్నాడు.
ఈ చిత్రం రాజశేకర్ కెరీర్ లో 91 వ చిత్రంగా రాబోతుంది. ఈ నేపథ్యంలోనే తన 92 వ చిత్రం ను కూడా లైన్ లో పెట్టాడు. మరోసారి ఈ చిత్రం యొక్క పోస్టర్ లుక్ తో సినిమాపై ఆలోచన కలిగించే విదంగా ఉన్న లుక్ ను విడుదల చేశాడు. అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 6న గతం అనే చిత్రం విడుదల అయింది. ఆ చిత్ర దర్శకుడు కిరణ్, రాజశేఖర్ 92 వ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాని శివాని శివాత్మిక, సృజన్, భార్గవ, హర్ష ప్రతాప్ లు నిర్మిస్తున్నారు.
వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. గరుడవేగ, కల్కి వంటి చిత్రాలు మరల రాజశేఖర్ బౌన్స్ బ్యాక్ అవడానికి ప్రధాన కారణం అయ్యాయి. రాజశేఖర్ అభిమానులు కూడా తమ హీరో మరల సినిమాలు చేస్తుండటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ భార్య జీవిత కూడా మరల డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుంది ఆమె గతంలో భర్తతో శేషు, ఆప్తుడు, ఎవడైతే నాకేంటి, మహంకాళి, సత్యమేవ జాయతే వంటి సూపర్ హిట్టు చిత్రాలకు దర్శకత్వం వహించింది. ప్రస్తుతం భర్త కోసం ఓ మంచి కథను సిద్దం చేసే పనిలో ఉంది. కూతురు శివాత్మిక కూడా దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.