
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త సంప్రదాయం మొదలైందట. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చి.. అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ల నుంచి.. స్టార్ హీరోయిన్ల వరకు ఒక్క సినిమాలో ఛాన్స్ సంపాదించాలంటే.. కనీసం ఆ తర్వాత మూడు సినిమాల్లో నటిస్తామని కమిట్ మెంట్ ఇవ్వాల్సిందేనట. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ అగ్రిమెంట్ కు ఓకే చెప్తేనే… సినిమా ఛాన్స్ ఇస్తున్నారట. అయితే ఏం చేయలేక కథానాయికలు కూడా అందుకు ఒప్పుకుంటున్నారట.

అలా డీల్ కుదుర్చుకునే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు తీస్తుంటారు. ఒకే హీరోయిన్ ను తన రెండు మూడు సినిమాల్లో రిపీట్ చేస్తుంటారు. ముందుగా సమంతను అలాగే తీసుకున్న ఆయన ఆ తర్వాత పూజా హెగ్డేతో సినిమాలు చేశారు. అంతకు ముందు హీరోయిన్ ఇలియానాతో అలాగే సినిమాలు తీశారు.

అయితే త్రివిక్రమ్ సినిమాలు చాలా వరకు హిట్ అవుతుండటంతో…ఆయన సినిమాల్లో చేసేందుకు కథానాయికలు కూడా ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన ఎలాంటి షరతులు పెట్టిన అందుకు ఒప్పుకుని మరీ సినిమాలు చేస్తున్నారు.

అలాగే మళయాళ హీరోయిన్ సంయుక్త మీనన్… ప్రస్తుతం త్రివిక్రమ్ చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో రానా భార్యగా కనిపంచనుంది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన నిర్మంచే మరో సినిమాలో కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇలా డీల్ కుదుర్చుకోవడం వల్లే డైరెక్టర్లు అలా ఒకే హీరోయిన్ తో వరుస సినిమాలు చేస్తున్నారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమానా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదొక ట్రెండ్ గా కనిపిస్తోంది.