టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సునీత పెళ్లి కూడా ఆమె కొడుకు, కూతురు మేరకే జరిగింది. వారు ఒత్తిడి తేవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. సునీత మొదటి భర్త తో విడిపోయిన తర్వాత చాలాకాలం ఒంటరిగా నే ఉన్నారు.
తన కూతురు, కొడుకు ను చదివించి పెద్ద వాళ్ళను చేసింది. ఆమె లైఫ్ లో మంచి పొజిషన్ కు వచ్చిన తర్వాతనే రెండో పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే సురేఖ వాణి కూడా రెండో పెళ్లి పై వార్తలు వచ్చాయి. తన కూతురు సుప్రియా రెండో పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. సునీత లాగా ఆమె తల్లీకి కూడా ఓ తోడును చూడాలని ఆమె అనుకునట్లుగా సమాచారం.
అయితే రెండో పెళ్లి విషయంపై సురేఖ వాణి ఏమన్నారు అంటే…ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనలో లేను. రెండు పెళ్లి గురించి అసలు ఆలోచినచ్చడం లేదు. అవన్నీ వట్టి పుకారులు మాత్రమే అని ఆమె అన్నారు. ఇంతటితో ఆమె పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. సురేఖ వాణి మొదటి భర్త సురేశ్ తేజ మంచి నటుడు మరియు దర్శకుడు కూడాను. ఆయన చాలా సినిమాల్లో నటించాడు. 2019 లో అనారోగ్యం తో మృతి చెందాడు. అప్పటి నుండి ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. భర్త చనిపోవడంతో సినిమాలో అవకాశాలు కూడా రావడం లేదు. రీసెంట్ గా తమిళంలో మాస్టర్ అనే చిత్రంలో ఓ చిన్న పాత్రలో సురేఖ వాణి కనిపించారు. ఈ మధ్యకాలంలో ఇంస్టా లో ఆమె ఫోటోలు వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే.