ఉరి సినిమా మనకు గుర్తు ఉంది కదా. 2019 లో ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చింది. 2016 సెప్టెంబర్ 18 న భారతీయ ఆర్మీ శిభిరాలపై దొంగ దాడి చేసి చాలా మంది మన జావానులను పొట్టన బెట్టుకున్నారు. అందుకు ఇండియా ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ పేరుతో పిఓకే లోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపింది. ఆ సంఘటనను బేస్ చేసుకొని ఊరి ది సర్జికల్ స్ట్రైక్ అనే చిత్రాని రూపొందించారు.
ఈ చిత్రంలో విక్కీ కౌశల్ మెయిన్ లీడ్ పాత్రలో నటించాడు. ఈ చిత్రాని హింది తో పాటుగా తమిళ. కన్నడ, తెలుగు, మలయాళ బాషలో విడుదల చేసి మంచి విజయం సాదించారు. అందుకు ఈ చిత్రంలోని మెయిన్ పాయింట్ ను తీసుకుని హైలెట్ గా చూపించారు. అందుకే ఆ చిత్రానికి ఆ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఆ నేపథ్యంలోనే మరో సినిమా రూపొందుతుంది. 2008 ముంబయి లో జరిగిన టెర్రర్ ఏటాక్ నేపథ్యంలో మేజర్ అనే చిత్రాని జిఎంబి సోని పిక్చర్స్, ఏ+ఎస్ మూవీస్ పై శశి కిరణ్ తిక్క ఈ చిత్రాని రూపొందిస్తున్నాడు.
పాన్ ఇండియా లేవలో ఈ చిత్రాని విడుదల చేయనున్నారు. బడ్జెట్ కూడా 40 కోట్లకు పైగానే ఖర్చు పెట్టారు. ఈ చిత్రం మేజర్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆదారంగా రూపొందుతుంది. ముంబయి టెర్రర్ ఏటాక్ లో శత్రువు ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. భారత ప్రభుత్వం శౌర్యపురస్కారం అశోక్ చక్రను ప్రదానం చేసింది. ఉరి సినిమాలగా మేజర్ సినిమా లో కూడా ఓ పాయింట్ అండర్ ప్లే అవ్వనున్నదని టాక్ వినపడుతుంది. ఉరి కి సినిమా ప్రేక్షకులు బాగా కనెక్ట్ కావడానికి కారణం దేశభక్తి ని ప్రధానంగా చేసుకొని చూపించారు అందుకే ఆ చిత్రం సూపర్ హిట్టు అయింది. మరి మేజర్ లో కూడా అలాంటి సీన్ ను రిపీట్ చేస్తుందా అనేది తెలియాలిసి ఉంది. ఈ చిత్రం జూలై 2 న విడుదల అవ్వుతుంది.