మెగా హీరో రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఆయన ఒక్కడు. ఈ స్థాయి కి రావడానికి చాలా శ్రమించాడు. ఆ శ్రమ వెనుక తన తండ్రి చిరంజీవి పాత్ర చాలా కీలకమైంది. చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విలన్ గా కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ హీరోగా మారిన వ్యక్తి. కోట్లలో అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఇప్పటివరకు 153 చిత్రాల్లో నటించాడు. ఆనాటి క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్, విలన్, అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను, చిరంజీవికి ఇచ్చి 1980 లో వివాహం చేశాడు.
అల్లు ఫ్యామిలీ అప్పటికే సినిమా రంగంలో ఉంది. నేడు చిరంజీవి, సురేఖల పెళ్లి రోజు. వారి పెళ్లి జరిగి నేటితో 42 సంవత్సరాలు. ఈ సందర్భంగా చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్.. ట్విట్టర్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. అమ్మ, నాన్న నే నా బలం అంటూ విష్ చేశాడు. ఈ సందర్భంగా వారి ఫోటోలను షేర్ చేశాడు. రామ్ చరణ్ విషయానికి వస్తే చిరుత సినిమాతో మెగా ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. తండ్రి స్థానాన్ని నిలబెట్టడానికి వారసుడు వచ్చాడు అనుకున్నారు.
చరణ్ కూడా ఆ స్థానం ను కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్‌టిఆర్ మరో పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు శంకర్ తో తన 15వ సినిమాలో నటించనున్నాడు. చిరంజీవి విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాని రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి లు నిర్మిస్తున్నారు. మే 13న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది.