నితిన్ హీరోగా చంద్ర శేకర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్రం రూపొందింది. ప్రియ ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాని భవ్య క్రియేషన్స్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రం ఈ నెల 26 న విడుదల అవుతుంది. ఈ చిత్రంలో నితిన్ చెక్ ప్లేయర్ గా దేశ ద్రోహి పాత్రలో నటించాడు. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చెక్ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమంలో బిజీగా ఉంది.
ఈ సందర్భంగా చెక్ టీమ్ మీడియా సమావేశం నిర్వహించింది… విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో నితిన్ మాట్లాడుతూ నా ఈ సినిమా ప్రయాణంలో లవ్, యాక్షన్, ఫ్యామిలీ సినిమాలు చేశాను. ఇది నేను చేస్తున్న ఓ వైవిధ్యభరితమైన సినిమా ఈ చిత్రంకోసం నేను 80 రోజులు జైల్లో గడిపాను. అక్కడి పరిస్థితులు చూసి భయమేసింది. ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాను అని అన్నాడు. నేను ఇప్పటివరకు చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు అయితే చెక్ చిత్రం ఒక్కటి మరో ఎత్తు అని అన్నాడు.
ఈ చిత్రం యొక్క నిర్మాత మాట్లాడుతూ.. చెక్ సినిమా చాలా మంచిగా వచ్చింది. తప్పకుండ విజయం సాదిస్తుందని అన్నాడు. అలాగే దర్శకుడు చంద్ర శేకర్ యేలేటి మాట్లాడుతూ.. నితిన్ లేనిది చెక్ చిత్రం లేదని అన్నాడు. ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అని తెలియజేశాడు. చెక్ సినిమా నాకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్న అని అన్నాడు. ఈ కార్యక్రమంలో మలయాళం నటి ప్రియ ప్రకాష్ వారియర్ కూడా పాల్గొన్నారు.