ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ తో తన సక్సెస్ ను ట్రాక్ లోకి తీసుకువచ్చాడు. రీసెంట్ గా కిషోర్ తిరుమల దర్శకత్వంలో “రెడ్” అనే చిత్రంలో నటించి మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రం లో రామ్ డ్యూయల్ రోల్ కనిపించి ఆకట్టుకున్నాడు. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత ఐయ్యర్ లు హీరోయిన్స్ గా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించాడు.
మణిశర్మ మరోసారి తన సంగీతం తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం జనవరి 14న విడుదల అయ్యింది. ఈ చిత్రంతో రామ్ 18 సినిమాలను పూర్తి చేసుకున్నాడు. రామ్ తనతదుపరి సినిమా విషయంలో కాస్త బ్రేక్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయన ఓ తమిళ దర్శకుడు సినిమాలో నటించబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ… ఆ తమిళ దర్శకుడు కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రామ్ తన 19వ సినిమాను దర్శకుడు, నిర్మాత అయిన లింగుస్వామి డైరెక్షన్ లో నటించనున్నాడు. ఈ చిత్రాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. ఈ బ్యానర్ లో వారికి ఇది ఆరోవ చిత్రం. తెలుగు, తమిళ బాషలో ఈ సినిమా రూపొందనున్నది. ఇదివరకే దర్శకుడు లింగుస్వామి, రామ్ ను కలిసి స్క్రిప్ట్ ను వినిపించాడు. కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పినట్లుగా తెలుస్తుంది.
రామ్ కూడా చరణ్ బాటలోనే తమిళ దర్శకుడుకి కే చెప్పాడు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.