నాగ్ అశ్విన్ తన సినిమా ప్రయాణాన్ని మొదట అసిస్టెంట్ దర్శకుడు గా మొదలు పెట్టాడు. మంచు మనోజ్ హీరోగా నటించిన “నేను మీకు తెలుసా” ? అనే చిత్రానికి సహాయక దర్శకుడు గా పనిచేశాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర అస్సిస్టెంట్ దర్శకుడుగా జాయిన్ అయ్యాడు. అయిన చేసిన లీడర్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రాలకు అసిస్టెంట్ దర్శకుడుగా పని చేశాడు. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నాని తో “ఎవడే సుబ్రమణ్యం” అనే చిత్రాని తీశాడు. ఈ చిత్రం డివైడ్ టాక్ ను దక్కించుకుంది.
తాజాగా బాహుబలి హీరో ప్రభాస్ తో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ కు కథను చెప్పి ఒప్పించడం జరిగింది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ బాలీవుడ్ హంగామా అనే చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ప్రభాస్ తో నా సినిమా త్వరలో మొదలవ్వబోతుంది. దీపిక పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు అంటూ తెలిపాడు. మా కాంబినేషన్ లో రాబోయే చిత్రం అన్నీ రికార్డ్స్ ను బద్దలు కొడుతుందని నాగ్ అశ్విన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
ఇక నాగ్ అశ్విన్ ఇంతకు ముందు “మహానటి” అనే చిత్రాని రూపొందించాడు. అలనాటి అందాల నటి సావిత్రి బయోపిక్ ఆదారంగా ఈ చిత్రాని తీశాడు. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. తెలుగుతో పాటుగా తమిళ్ లో ఈ చిత్రం మంచి విజయని సాదించింది. జెమిని గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు .ప్రస్తుతం పిట్టకథలు అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి నలుగురు దర్శకులు పని చేశారు. అందులో నాగ్ అశ్విన్ కూడా ఒక్కడు. ఈ క్రమంలోనే జాతిరత్నాలు అనే సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంతో సినిమా నిర్మాతగా మారిపోయాడు. స్వప్నా సినిమా బ్యానర్ పై నిర్మించాడు. కామిడి ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది.