దర్శకుడు శ్రీను వైట్ల ఘటమనేని కృష్ణ ఫ్యామిలీ కి వీరాభిమాని. ఈ విషయాని చాలా ఆడియో ఫంక్షన్స్ లో చెప్పాడు. మహేష్ బాబు తో రెండు సినిమాలు తీశాడు అందులో “దూకుడు” చిత్రం మంచి విజయాన్ని సాదించింది. సమంత కథానాయక గా నటించింది. ఈ చిత్రం 2011 లో విడుదలైంది. ఫ్లాప్ లతో వస్తున్న మహేష్ కు ఈ చిత్రం మంచి ఊరటని ఇచ్చింది. మహేష్ కెరీర్ లోనే దూకుడు చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాని కన్నడ లోకూడా రీమేక్ చేశారు. అక్కడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించాడు.
ఆ తర్వాత 2014 లో మహేష్ తో “ఆగడు” చిత్రం తీశాడు. ఈ చిత్రం ఫ్లాఫ్ అవ్వడంతో దర్శకుడు విమర్శలపాలు అయ్యాడు. ఇక అప్పటినుండి మహేష్ బాబు కూడా శ్రీను వైట్లతో సినిమా అంటే ససేమిరా అంటున్నాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల చిత్రాలు కూడ వరస పరాజయం పాలు అయ్యాయి. రామ్ చరణ్ బ్రూస్ లీ, వరుణ్ తేజ్ మిస్టర్, 2018 లో అమర్ అక్బర్ అంథోని చిత్రాలు శ్రీను వైట్లను కొలుకొనివ్వకుండా చేశాయి. ఆ తర్వాత శ్రీను కూడా మెగా ఫోన్ పట్టుకోవాలంటే భయపడి పోయాడు. ఆయన ప్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం రొటీన్ కామిడిని ప్రతి సినిమాలో కంటిన్యూ చేయడం. ఇది పెద్ద మైనస్ గా మారింది.
ఫిల్మ్ నగర్ సర్కిల్ నుండి అందుతున్న సమాచారం మేరకు శ్రీను వైట్ల మహేశ్ బాబు కోసం ఓ కథను సిద్దం చేశాడు అంట. మరల ఎలాగైనా ప్రిన్స్ తో సినిమా చెయ్యాలని ఆరాటపడుతున్నాడు. మహేష్ బాబు ఆయన మీద గౌరవం తో కథను విన్న అయిన కు ఉన్న బిజీ షెడ్యూల్ వలన ఈ చిత్రం ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్ళక పోవచ్చు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ లో ఉన్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చెయ్యాలిసి ఉంది. ఇది ఆల్రెడీ అఫిసియల్ గా కన్ఫర్మ్ చేశారు. జక్కన తో సినిమా అంటే ఎంతలేదన్న ఏడాదిన్నర పడుతుంది. 2024 వరకు శ్రీను వైట్ల వెయిట్ చేయాలిసి ఉంటుంది. మరి ఆ సమయం వరకు అయిన ఉంటాడా లేదా అనే విషయం తెలియలిసి ఉంది. పరిస్థితులు ఎప్పుడైనా, ఎలాగైనా మారవచ్చు.