విజయ్ సేతుపతి తమిళ సినిమా ఇండస్ష్ట్రి లో మంచి పేరు ఉన్న నటుడు. నటనలో కమల్ హాసన్ తర్వాత అంతటి వాడు అని చెబుతూ ఉంటారు. అలాంటి నటుడు ఇప్పుడు తెలుగులో తన సత్తా నిరూపించుకోవడానికి ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో విజయ్ నటనకు ఇక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. విలన్ పాత్రలో విజయ్ జీవించాడు. క్లైమాక్స్ సమయంలో మాటలు లేకుండా కంటితోనే హావబావాలు పలికించాడు.
విజయ్ కు నటనలో తిరుగులేదు అయిన ఎలాంటి పాత్రలో అయిన సరే నటించగలడు. ఇక రానున్న రోజుల్లో తెలుగులో ఆయనకు పెద్ద సమస్యగా మారేది ఆయన వాయిస్ మాత్రమే. ఆయన కు తగిన గొంతు ను వెతుక్కోవడమో లేకపోతే ఆయనే సొంతంగా తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడమో చేయాలిసి ఉంటుంది . చాలా మంది తమిళ నటులు ఇక్కడ సత్త చూపించారు. కానీ ఎక్కువ రోజులు నిలబడ లేకపోయారు.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో కొట్టొచ్చినట్లుగా కనిపించేది ఏమిటి అంటే ఇక్కడ విలన్ లు లేరు. అందుకు బాలీవుడ్ నుండి చాలా మందిని రంగంలోకి దింపుతున్నారు. ఇలాంటి తరుణంలో సౌత్ సినిమాకు చెందిన విజయ్ సేతుపతి ఒక్కడే తెలుగు సినిమా హీరోలకు విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక అయిన తనకు మైనస్ గా ఉన్న తెలుగు బాషను అనర్గళంగా నేర్చుకుంటే మాత్రం ఇక్కడ లేని విలన్ లోటును భర్తీ చేసినవాడు అవ్వుతాడు.
రీసెంట్ గా తమిళ్ లో విజయ్ నటించిన మాస్టర్ చిత్రం లోని భవాని పాత్ర తెలుగు ప్రేక్షకులకు భాగ కనెక్ట్ అయ్యింది. ఆ పాత్రలో నటించిన విజయ్ సేతుపతిని చూసి తెలుగు సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.