కృతి ఖర్బంధ బోణి చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది. తమిళ, హింది సినిమాలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. తెలుగులో ఓ నాలుగు సినిమాలకు పైనే నటించింది. పవన్ తో తీన్ మార్, రామ్ తో ఒంగోల్ గిత్త, చిత్రాలో నటించింది. ఇక రామ్ చరణ్ బ్రూస్ లీ ఫైటర్ చిత్రంలో చరణ్ కు చెల్లి పాత్రలో నటించింది. తాజాగా ఆమె లాక్ డౌన్ సమయంలో ఆమె ఫేస్ చేసిన సంఘటనలను ఓ నేషనల్ మీడియా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది.
కరోనా నేపథ్యంలో దేశం అంతట లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మొదట 21 రోజుల తర్వాత అంతా నార్మల్ అవ్వుతుంది అనుకున్న కానీ ఏకంగా ఆరు నెలలు విధించడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకున్న.. కరోనా సద్దుమనుగుతున్న తరుణంలో మొదటిసారిగా కెమెరా ను ఫేస్ చేస్తున్న సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ సమయంలోనేను మలేరియా జ్వరం తో బాధపడుతున్న, నాకు మొదటి నుండి కూడా రోగనిరోదక శక్తి తక్కువే అయిన ఆ జ్వరం తోనే షూటింగ్ లో పాల్గొన్నాను.
దేవుడి దయ వలన నాకు కరోనా వైరస్ సోకలేదు. నా జీవితంలో 2020 వ సంవత్సరం మర్చిపోలేనిది. కృతి ఖర్బంధ సినిమాల విషయానికి వస్తే తమిళంలో వాన్ అనే చిత్రంలో నటిస్తుంది. దుల్కర్ సల్మాన్ హీరో గ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆర్ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీలో దేవాన్శ్ సింగ్ దర్శకత్వంలో 14 ఫెరే అనే చిత్రంలో నటిస్తుంది. విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం 9 జూలై న విడుదల అవ్వుతుంది.