మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిరుత సినిమాతో తెలుగు సినిమాలోకి వచ్చాడు. చిరంజీవి ఎంత గొప్ప నటుడో అందరికి తెలిసినదే మరి ఆయన వారసుడిగా చరణ్ సినిమాలోకి వస్తున్నాడు అంటే అటు అభిమానులోనూ, సగటు ప్రేక్షకుడులోనూ ఏదో ఒకటి ఆయన నుండి ఆశిస్తూనే ఉంటారు. చర్రీ మొదటి సినిమాతోనే సక్సెస్ ఏమి కొట్టలేదు.
ఒక్కో సినిమాకు తనను తానుగా నటుడుగా మార్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఓ స్టార్ హీరో రేంజ్ లో ఉన్నాడు. నిజానికి చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకున్నా తర్వాతే ఆ మార్పు మొదలైంది. పెద్దరికం అనేది అలవాటు అయింది. ఇప్పుడు ఏమి చేసిన. ఎలాంటి సినిమా చేయాలి అనుకున్న ఆలోచించి అడుగులు వేస్తున్నాడు. చరణ్ సినిమాలతో బిజీగా ఉంటే, ఉపాసనా వైధ్య రంగంలో బిజీగా ఉంటుంది. కానీ వాళ్ళ ప్రేమకు మాత్రం హద్దులు లేవనే చెప్పాలి.
ఈ జంట సమయం దొరికినప్పుడల్ల ఫారెన్ ట్రిప్పులు, అంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిన్న వేలంటెన్స్ డే సందర్భంగా ఉపాసన తన జీవితంలో, చర్రీ తో గడిపిన కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకుంది. ప్రేమికుల దినోత్సవం అనేది నా లైఫ్ లో ఎప్పటికి మర్చిపోలేనిది. మాకు పెళ్ళై ఎనిమిది ఏండ్లు అవ్వుతుంది. మా మధ్య కూడా చిన్న చిన్న గొడవలు అనేవి వస్తుంటాయి. అలా గొడవలు అనేవి వచ్చినప్పుడే భార్య భర్తల మధ్య బందం మరింత బలపడుతుందని నేను నమ్ముతాను అని అన్నారు.
అలాగే ఓ వేలంటైన్ నాడు చరణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చరణ్ ఓ హార్ట్ సింబల్ తో గిఫ్ట్ చేయించి ఇచ్చాడు. అది నాకు ఎంతో నచ్చింది. ఎవరైనా సరే ఎంత ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చారు అనేది ముఖ్యం కాదు ఎంత ప్రేమతో ఇచ్చారు అనేది ముఖ్యం అని ఉపాసనా ఈ వేలంటన్స్ డే నాడు గుర్తుచేసుకుంది.