వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి వారసత్వాని పుణికిపుచ్చుకుంది. విశాల్ “పందెం కోడి 2” చిత్రంతోనే తనలో దాగి ఉన్న విలనిజం ను చూపించింది. తాజా ఇంటర్వ్యూ లో వరలక్ష్మి … నాకు నటనలో విజయ్ సేతుపతి గారే ఆదర్శం అని చెప్పింది. ఎప్పుడు ఒకే తరహా పాత్రకు పరిమితమై పోకుండా అన్నీ రకాల పాత్రలు చేయాలి అనేది నా ఆలోచన అప్పుడే మనం సంపూర్ణ నటిగా గుర్తింపు వచ్చినట్లు లెక్క అని ఆమె అంటుంది.
నటన అనేది ఉద్యోగం లాంటిది. నిరంతరం కష్టపడుతు ఉంటేనే అభివృద్దిలోకి వస్తాం అన్నారు. క్రాక్ చిత్రంలో సముద్రఖని తో కలిసి జయమ్మ అనే పాత్రలో నటించాను. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. నాన్న గారు కూడా జయమ్మ పాత్ర లో నన్ను చూసి మెచ్చుకున్నారు చాలా బాగా చేశావు అని అన్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా క్రాక్ చిత్రంలోని నా పాత్రకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. డబ్బింగ్ కూడా బాగా చెప్పావు అని చెప్పడంతో చాలా సంతోషం గా అనిపించింది.
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ గా నటించిన చిత్రం నాంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ క్రిమినల్ లాయర్ పాత్రలో నటించింది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ… నేను మొదటిసారిగా క్రిమినల్ లాయర్ పాత్రలో నటించాను చాలా పెద్ద పెద్ద డైలాగ్ లు ఉంటాయని నాకు తెలుసు అందుకే నైట్ మొత్తం బట్టి పట్టి వాటిని చెప్పేదాన్ని అని ఆమె అన్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారం గా ఆయన ఈ కథను తయారు చేసుకున్నాడు అని ఆమె చెప్పింది. ఈ నెల 19 న ఈ చిత్రం విడుదల అవ్వుతుంది. సతీష్ వేగేష్ణ ఈ చిత్రాని నిర్మించాడు.