మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారికా మ్యారేజ్ ఆ మధ్య సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ విన్న నిహారికా పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. అంత అంగరంగ వైభవంగా ఆమె పెళ్లిని నాగబాబు జరిపించాడు. వీరి వివాహం రాజస్తాన్ లోని ఉదయపూర్ ప్యాలేస్ లోని ఉదయ్ విలాస్ లో కుటుంబ సభ్యులు, రాజకీయనాయకుల మధ్య జరిగింది.
అల్లు, మెగా ఫ్యామిలీ ఈ వేడుకలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఉదయ్ పూర్ కు వారం రోజుల ముందే చేరుకొని , ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్లు, బ్యాచిలర్ పార్టీలు, సంగీత్ అంటూ తెగ ఎంజాయ్ చేశారు. ఇంత ఘనంగా నాగబాబు తన కూతురి వివాహనంను జొన్నలగడ్డ చైతన్య కు ఇచ్చి జరిపించాడు. వీరిది ప్రేమ వివాహం కాదు పెద్దలు కుదిరించిన పెళ్లినే. నిహారికా తన పెళ్లి చైతన్య తో జరగడానికి ముందు మా పెద్దనాన్న చిరంజీవి ఓ విషయం చెప్పారు అంటూ …
పెద్దల ఏర్పాటు పై మేము ఒకరికి ఒకరం కలుసుకున్నాం. ఆ సమయంలో మీరు ఒకరినొకరు ఇష్టపడితేనే పెళ్లి చేసుకోమని చిరంజీవి గారు చెప్పారు అని నిహారికా ఈ సందర్భంగా చైతన్య తో వివాహం గురించి చెప్పింది. అంతే తప్ప పెద్దల అంగీకారంతో వివాహం జరగలేదు. ప్రస్తుతం నిహారికా తన తండ్రి నాగబాబు తో కలిసి స్టాండ్ అప్ కామిడీ లో జడ్జ్ గా చేస్తుంది. చైతన్య తో తో కలిసి మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న నిహారికా ఓ వెబ్ సిరీస్ లో నటించింది. పెళ్లి తర్వాత తన సినిమా సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఇప్పట్లో ఏమి ఆలోచించడం లేదు.