టాలీవుడ్ కి “కృష్ణగాడి వీరప్రేమగాథ” చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన పంజాబ్ ముద్దుగుమ్మ మెహరిన్ కౌర్ ఫిర్జాద, మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఈమె చేసింది పది సినిమాల లోపే అయిన నటిగా విమర్శకుల ప్రశంశలు అందుకుంది. మహానుబావుడు, రాజ ది గ్రేట్ ఎఫ్ 2 వంటి చిత్రాలు ఆమె కు మరింత గుర్తింపు తెచ్చి పెట్టాయి.
ఈ నేపథ్యంలో ఆమె గొప్ప రాజకీయ నేపథ్యం కలిగిన ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అవును ఇది నిజమే త్వరలో మెహరిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఈ విషయం ఆమె అభిమానులు జీర్ణించుకోవడం కొంచెం కష్టమే కానీ ఇదే నిజం. హర్యానా రాష్ట్రానికి చెందినియా భవ్య బిశ్నోయ్ ను పెళ్లి చేసుకోబోతుంది. ఈయన తండ్రిగారు కుల్దీప్ బిష్ణోయ్ ప్రస్తుతం ఆడంపూర్ కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ గా కొనసాగుతున్నాడు. ఈయన తండ్రి హర్యానా కు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆయనే భజన లాల్ బిష్ణోయ్.
అయిన మనవాడే భవ్య బిష్ణోయ్. అవును ఇప్పుడు ఇతనికి ఇచ్చి వివాహం చెయ్యడానికి మెహరిన్ కుటుంబ సభ్యులు అన్నీ ఏర్పాట్లను చేస్తున్నారు. వీరి నిశ్చితార్థం మార్చి 13 న జరగనున్నది. ఈ వేడుకకు రాజస్తాన్ లోని జోధాపూర్ విల్లా ప్యాలెస్ వేడుక అవ్వుతుంది. ఈ నేపథ్యంలో ఈ జంట పబ్లిక్ గానే తిరుగేస్తున్నారు. తన హబ్బి తో కలిసి మెహరిన్ నవ్వులు చిందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతున్నాయి.
ఈ ఏడాది సమ్మర్ లో వీరి వివాహం జరగనున్నది. మెహరిన్ సినిమా విషయానికి వస్తే అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా ఎఫ్ 3 చిత్రంలో నటిస్తుంది. ఈమె తెలుగు తో పాటుగా తమిళ, హింది సినిమాలోనూ నటించింది.