మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కరోనా కారణంగ షూటింగ్ పోస్ట్ పోన్ అవ్వుతు వస్తున్న ఈ చిత్రం ఇప్పుడిప్పుడే తిరిగి వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తన నెక్స్ట్ షెడ్యూల్ ను ఈ నెల 17 నుండి ఖమ్మం జిల్లా ఇల్లందులోని జేకే మైన్స్ లో జరుపుకొనున్నది.
ఈ చిత్రం మే 13 న విడుదల అవ్వుతుంది. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాను “తని ఓరువన్” ఫేమ్ మోహన్ రాజ దర్శకత్వంలో మలయాళం రీమేక్ మూవీ లూసిఫర్ లో నటించనున్నాడు. తెలుగు నేటివిటీకి తగిన విదంగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నారు. మొదట ఈ చిత్రానికి నయనతార పేరును తీసుకువచ్చారు. కానీ ఆమె తప్పుకోవడంతో మరో హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు.
ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాని సంక్రాంతి విడుదల అవ్వనున్నది. ఈ క్రమంలో చిరంజీవి తన నెక్స్ట్ సినిమా తమిళ్ మూవీ వేదాలమ్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించనున్నాడు. చాలాకాలం తర్వాత మెగాస్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్ చరణ్ ఈ చిత్రాని నిర్మించనున్నాడు.
ఈ చిత్రం 2022 సమ్మర్ లో విడుదల అవ్వుతుంది. మెగాస్టార్ చిరంజీవి తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు ఆరు నెలలకు ఓ సినిమా చొప్పున విడుదల చేస్తున్నాడు. కుర్ర హీరోలు మాత్రం ఏడాదికి ఓ సినిమా అంటూ చేసుకుంటూ పోతున్నారు. 65 ఏళ్ల వయసులోను మెగాస్టార్ కుర్ర హీరోలగా సినిమాలు చేస్తున్నాడు.