ఈటివి లో జబర్దస్త్ షోకి పబ్లిక్ లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగ చెప్పాలిసిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. అందులో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, అవినాష్, అది, అభి, ఇలా ఎంతో మంది స్టార్ కామెడియన్స్ గా మారిపోయారు. జబర్దస్త్ అంటేనే వీళ్ళ పేర్లు గుర్తుకు వస్తాయి.
ఈ షో నుండి స్టార్ మా బిగ్ బాస్ షో కి ముక్కు అవినాష్ వెళ్ళాడు. ఆ సమయంలో ఈటివి యజమాన్యం తమ అగ్రిమెంట్ ప్రకారం మధ్యలో వెళ్లిపోతే పది లక్షలు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో ఆ మొత్తం డబ్బును చెల్లించి మరి వెళ్ళాడు. బిగ్ బాస్ షో ద్వారా బాగానే సంపాదించుకున్నాడు. ఆ షో నుండి బయటకు వచ్చిన అవినాష్ మరల తిరిగి జబర్దస్త్ షోకి వెళ్లలేదు. అందుకు కారణం ఏమిటనే విషయం మాత్రం ఎవరికి తెలియరాలేదు.
అయితే స్టార్ మాతో కుదిరిన అగ్రీమెంట్ ఇంకా పూర్తి కాలేదు అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ మా వారు కామిడీ స్టార్స్ అనే సరికొత్త కామిడి షో ని తీసుకువచ్చారు. ఇందులో అదిరింది కామిడీ స్టార్స్ మరియు జబర్దస్త్ కమెడియన్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లు కలిసి స్కిట్స్ చేస్తున్నారు టిఆర్‌పి రేటింగ్ విషయంలో కామిడీ స్టార్స్ , జబర్దస్త్ ను దాటేసే దూసుకుపోతుంది. 9.8 రేటింగ్ తో కామెడీ స్టార్ అలరిస్తుంది.
ఈ షో ద్వారా అవినాష్ జబర్దస్త్ పై రివెంజ్ తీసుకుంటున్నాడు. ఈ షో లో ఆయన స్కిట్స్ కు మంచి రేటింగ్ వస్తుంది. జబర్దస్త్ ను, ముక్కు అవినాష్ స్కిట్స్ బీట్ చేస్తున్నాయి. ఇంతకు ముందు జబర్దస్త్ షో కి జడ్జ్ గా పనిచేసిన నాగబాబు ఆ షోని విడిచి వెళ్ళిన తర్వాత ఎలాగైనా ఆ షోని డామినేట్ చేయాలని అదిరింది షో కి గెస్ట్ గా వచ్చాడు.
కానీ జబర్దస్త్ మాత్రం ఫుల్ స్పీడ్ తో దూసుకుపోయింది. ఇక నాగబాబు కూడా ఆ షోని వదిలేసి స్టాండ్ అప్ కామిడి షోస్ కి జడ్జ్ గా చేస్తున్నాడు. జబర్దస్త్ ను స్టార్ మా కామిడీ స్టార్స్ షో తప్ప మరెవరు బీట్ చేయలేకపోయారు.