న్యాచురల్ స్టార్ నాని వరస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అందులో ఆయన నటించిన “టక్ జగదీష్” చిత్రం ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రం తర్వాత “టాక్సీవాల” చిత్ర దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో నటించనున్నాడు. నాని కోసం ఈ దర్శకుడు ఇప్పటికే రెండు ఏండ్లు ఎదురుచూశాడు.
నిజానికి ఈ చిత్రం డిసెంబర్ చివరి నాటికి విడుదల కావలిసింది కానీ…కరోనా, లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పోస్ట్ పోన్ అయింది. ఎట్టకేలకు ఈ చిత్రం యొక్క షూటింగ్ నేటి నుండి మొదలు అవ్వుతుంది. కలకత్తా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరగనున్నది. ఎందుకు అంటే పిరియాడికల్ నేపథ్యం కలిగిన చిత్రం గా రాబోతుంది. కావున పాతకాలపు కలకత్తా ను ఈ చిత్రంలో చూపించనున్నారు.
ఇప్పటికే చిత్ర బృందం అక్కడికి బయలు దేరి వెళ్లింది. ఈ చిత్రంలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. అందులో మలయాళం కు చెందిన ఇద్దరు నటీమణులు ఉన్నారు. ఒక్కరు సాయి పల్లవి అయితే మరొకరు మడోనా సెబాస్టియన్, ఇంకో హీరోయిన్ వచ్చేసి కన్నడ బ్యూటీ ఉప్పెన చిత్రంతో తెలుగు సినిమాకు పరిచయం అయిన కృతి శెట్టి లు నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ముగ్గురు మరియు నానితో కలిపి కలకత్తా లో షూటింగ్ జరుపుతున్నారు. సెకండ్ షెడ్యూల్ కోసం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక్కడ ఈ చిత్రంకోసం ఓ భారీ సెట్ ను నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రానికి శ్యామ్ సింగరాయ్ అని టైటిల్ పెట్టి ప్రేక్షకుల మనసులో మంచి బజ్ క్రియేట్ చేశారు.
ఈ చిత్రాని నిహారికా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు.