రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాని ఛార్మి కౌర్, కరణ్ జోహర్ లు పురి కెనెక్ట్, ధర్మ ప్రొడక్షన్ పై నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనణ్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంతో రౌడీ స్టార్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. కావున పాన్ ఇండియా లేవల్లో షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం ముంబయి లో ఈ చిత్రం యొక్క సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికర విషయాలను సినిమా ప్రేక్షకులతో పంచుకున్నాడు. ముంబయి లో షూటింగ్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నాను. ఇక్కడ చాలా ప్రశాంత వాతావరణంలో షూటింగ్ జరుగుతుంది. ఎలాంటి హడావుడి హంగు ఆర్భాటంలేదు. చక్కగా షూటింగ్ చేసుకొని నేరుగా హోటల్ కి వెళ్లిపోతున్నాం.
ఇక నుండి ముంబయి ని నా సినిమా షూటింగ్ లకు అడ్డాగా మార్చుకుందాం అనుకుంటున్న అని అన్నాడు. ఇక్కడ ఎలాంటి ఫ్యాన్స్ హడావుడి లేదు అని అన్నాడు. అదే హైదరాబాద్ లో షూటింగ్ అయితే అభిమానుల హడావుడి ఎక్కువగా ఉంటుంది. నాకోసం ఎక్కడి నుండో చూడటానికి వాస్తు ఉంటారు నాకోసం వాళ్ళు ఇబ్బంది పడటం నచ్చదు.
లైగర్ ద్వారా బాలీవుడ్ కు వెళ్ళడానికి కారణం ఏదైనా ఉందా అంటే అలాంటిది ఏమి లేదని అన్నాడు. మంచి కథలను ప్రేక్షకులకు పరిచయం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నా గత చిత్రాలు మంచి విజయని సాదించి పెట్టాయి. వాటికన్న బెట్టర్ గా తన తదుపరి సినిమాలు ఉండాలని నేను అనుకుంటాను. నేను అభిమానుల విషయంలోనే చాలా బాధ్యతగా ప్రవర్తిస్తాను. వాళ్ళు అక్కడ ఉండబట్టే మన సినిమాలు థియేటర్ లో విడుదల అవ్వుతున్నాయి.
వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో టికెట్ కొని సినిమా చూస్తారు కావున వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మన కర్తవ్యం గా నేను భావిస్తాను అని విజయ్ దేవరకొండ అన్నాడు.