“ఛలో” సినిమాతో తెలుగు ఇండస్ష్ట్రి కి పరిచయం అయిన రష్మిక. అతి తక్కువ కాలంలోనే పెద్ద హీరోల సరసన నటించి టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ప్లేస్ లో చేరిపోయింది. దాంతోపాటుగా తన రెమ్యూనరేషన్ కూడా పెంచినట్లు తెలుస్తుంది. చాలా మంది యువ హీరోలు రష్మిక వెంట పడుతుంటే ఆ మాత్రం చెల్లించాలిసి ఉంటుంది.
మొదట నుండు కూడా 60 నుండి 70 లక్షలు తీసుకునే రష్మిక. ఇప్పుడు ఓ చిత్రానికి 1.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఆ రెమ్యూనరేషన్ ను కాస్త రెండు కోట్లకు రౌండ్ ఫిగర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం రష్మిక వద్దకు చేరడంతో అందులో ఏం తప్పు ఉంది అన్నట్లుగా మాట్లాడుతుంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు త్వరలో నిజం కావాలని కోరుకుంటున్న అని అన్నది.
ఇంకా రెమ్యూనరేషన్ విషయంలో గాసిప్స్ ఇంకా హై రేంజ్ లో ఉండాలని అనుకుంటున్నాను అని అన్నది. హీరోలు 10 నుండి 20 కోట్లు తీసుకుంటుంటే మాకు ఆ మాత్రం ఉండొద్దా అంటూ ప్రశ్నిస్తుంది. ఇక రష్మిక ప్రస్తుతం కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి అయిన వెంటనే తన నెక్స్ట్ సినిమల గురించి ఆలోచిస్తాను అంటుంది.
టాలీవుడ్ లో అల్లు అర్జున్ హీరోగా “పుష్ప” అనే చిత్రంలో నటిస్తుంది. తమిళంలో కార్తీ హీరోగా “సుల్తాన్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది. “మిషన్ మజ్ను” అనే చిత్రంతో అక్కడ పరిచయం అవ్వుతుంది. కన్నడలో “పొగరు” అనే చిత్రంను పూర్తి చేసింది. ఈ చిత్రం తెలుగులోను విడుదల అవ్వుతుంది.