బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ అదిపురుష్ అనే చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో శ్రీ రాముడు పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ కూడా రామాయణం త్రీడి చిత్రాని పాన్ ఇండియా లెవల్ లో నిర్మించాలని ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజా సమాచారం మేరకు శ్రీ రాముడు పాత్రలో మహేష్ బాబు నటించనున్నాడని తెలుస్తుంది.
లంకేశ్వరుడిగా హృతిక్ రోశన్ నటించనున్నాడు. ఈ చిత్రాని మూడు పార్టులుగా తెరకెక్కనున్నదని సమాచారం. అదిపురుష్ చిత్రానికి పోటీగా అల్లు అరవింద్ తన రామాయణం చిత్రాని నిర్మించాలని అనుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ అదిపురుష్ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ రూపొందబోతుంది. ఇప్పటికే 20 మంది గ్రాఫిక్స్ నిపుణులతో అదిపురుష్ సామ్రాజ్యాని నిర్మిచే పనిలో ఉన్నాడు.
ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు దశరథుడు పాత్రలో నటిస్తున్నాడు. రాముడు తమ్ముడు లక్ష్మణుడు పాత్రలో టైగర్ ష్రాఫ్ నటించనున్నాడు. సీత పాత్ర కోసం కృతి సనన్ ను అనుకుంటున్నారు. లంకేశ్వరుడు గా సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలు అవ్వబోతుంది అనగ అదిపురుష్ సెట్ అగ్నికి ఆహుతి అవ్వడంతో షూటింగ్ కి కాస్త బ్రేక్ పడింది. త్వరలోనే తిరిగి సెట్స్ పైకి వెళ్లనున్నది.
అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెనలతో కలిసి రామాయణం త్రీడి చిత్రాని నిర్మించాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ లు వహించనున్నారు. గతంలో వీరు దంగల్, మామ్ వంటి సినిమాలను రూపొందించారు. ఈ చిత్రంలో శ్రీ రాముడు పాత్ర లో మహేష్. రావణుడు పాత్రలో హృతిక్ రోశన్ లు నటించనున్నట్లుగా వీరి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ చిత్రం సెట్ పైకి వెళ్ళాలి అంటే 2022 వరకు అగాలిసిందే ఎందుకు అంటే మహేష్ బాబు తన తదుపరి సినిమాను రాజమౌళి తో చేయనున్నాడు. కావున ఆ మాత్రం సమయం పడుతుంది. ఓం రౌత్ తన అదిపురుష్ చిత్రాని 2022 నాటికి విడుదల చేస్తాడు. అల్లు అరవింద్ రామాయణం 2024 నాటికి మూడు పార్టులుగా విడుదల అవ్వుతుంది. కావున ఇద్దరి మధ్య పోటీ అనేది లేకపోవచ్చు అని తెలుస్తుంది.