బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా తన ఆత్మకత “ఆన్ ఫినిష్డ్” లో ఓ బాలీవుడ్ డైరెక్టర్ అరాచకాని బట్టబయలు చేసింది. అందులో ఈ విధంగా రాసుకొచ్చింది… నేను బాలీవుడ్ కు పరిచయం అవ్వుతున్న రోజులు అవి. ఆ సమయంలో ఓ దర్శకుడు నన్ను చూసి నీ వక్షోజాలు చిన్నవి… పిరుదులు పెద్దవి వెంటనే వాటిని సరిచేసుకోవాలని చెప్పాడు.
ఆవిషయం చెప్పగానే మొదట నేను కంగుతున్న ఆ తర్వాత దర్శకుడు నాకు ఫారెన్ లో తెలిసిన డాక్టర్ ఒక్కరు ఉన్నారు వెళ్ళి ఆయనను కలిసి సర్జరీ చేయించుకోండి అని చెప్పారు అని ప్రియాంకా చోప్రా చెప్పకొచ్చింది. ఆ మాటలతో నేను చాలా బాదపడ్డాను… ఆ తర్వాత ఓ ఐటెమ్ సాంగ్ ను రూపొందించే క్రమంలో బాలీవుడ్ దర్శకుడు బట్టలు మొత్తం విప్పాలని కోరాడు ఆ సమయంలో నాకు పట్టలేను అంత కోపం వచ్చిన పంటి కింద బిగపట్టి ఆ దర్శకుడిని ప్రాధేయపడ్డాను.
నా రంగులో కనిపించే బట్టలు ధరిస్తాను అని చెప్పాను ఆయన వినకుండా మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి స్టైలిస్ట్ తో వెళ్ళి మాట్లాడండి అని అన్నాడు. నేను వెంటనే స్టైలిస్ట్ కు ఫోన్ చేసి మాట్లాడితే మీరు ఏదైనా చేయండి మీ ప్యాంటిలు మాత్రం కనిపించాలి అప్పుడే ప్రేక్షకులు సినిమా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారు అని అన్నాడు.
ఆ సమయంలో నాకు పట్టలేని కోపం వచ్చింది.. ఆ తర్వాత బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పగా ఆయన వెంటనే సెట్ వద్దకు రాగానే ఆ దర్శకుడు భయంతో బిత్తర చూపులు చూశాడు. ఆ సమయంలో సల్మాన్ వచ్చి మాట్లాడటంతో ఆ విషయం సద్దు మనిగిందని ప్రియాంకా చోప్రా తన “ఆన్ ఫినిష్డ్” ఆత్మకతలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.