అల్లు అరవింద్ అండ్ టీమ్ ఆద్వర్యంలో ఆహా ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. రోజు రోజుకు సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంటూ పోతుంది. ఓ వైపు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూనే మరో వైపు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తుంది. ఆల్రెడీ మలయాళంలో సూపర్ హిట్టు గా నిలిచిన పలు చిత్రాలు ఆహాలో విడుదలై మంచి విజయాన్ని సాదించాయి.
ఈ నేపథ్యంలోనే మరో మలయాళం సినిమాపై ఫోకస్ పెట్టింది అదే 2020 వ సంవత్సరంలో వచ్చిన “అంజామ్ పత్తిరా” చిత్రాని తెలుగులో “మిడ్ నైట్ మర్డర్స్” పేరుతో డబ్బ్ చేసి ఈ నెల 19 న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మిధున్ మాన్యుల్ థామస్ దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశం తో ఈ చిత్రం రూపొందింది. కున్చాకో బొబన్, శ్రీనాథ్ భాసి, శరాఫ్ యూ ధీన్, తదితరులు నటించారు.
ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్, మాన్యుల్ మూవీ మేకర్స్ సంస్థలపై ఆషిక్ ఉస్మాన్ ఈ చిత్రాని నిర్మించాడు. ఇప్పుడు ఈ చిత్రం ఆహాలో స్ట్రిమింగ్ అవ్వనున్నది. ఆహా మరో మంచి కంటెంట్ ఉన్న సినిమాను తీసుకువస్తుండటంతో ఆహా సబ్ స్క్రైబర్స్ ఎంతగానో ఈ చిత్రంకోసం ఎదురుచూస్తున్నారు. అలాగే మలయాళీ నటి అమల పాల్ తో ఓ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఆహా టాక్ షో, వెబ్ సిరీస్ లతో దూసుకుపోతుంది.
అలాగే లాక్ డౌన్ సమయాని ఆహా మంచిగా ఉపయోగించుకొని చిన్న చిన్న సినిమాలను విడుదల చేసింది. ఈమధ్యనే ఆహా ఏడాది పూర్తి చేసుకుంది. అందుకు యానివర్సరీ సెలబ్రేషన్స్ ను కూడా జరుపుకుంది. అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చి అలరించాడు.